**ఎరుమేలిలో అయ్యప్పస్వాముల నృత్యాలు
చూపురులను అక్కట్టుకున్న భక్తి విన్యాసాలు**
కామారెడ్డి జిల్లా / నాగిరెడ్డిపేట: మనోరంజని తెలుగు టైమ్స్
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటకు చెందిన అయ్యప్పస్వాములు శబరిమల యాత్రలో భాగంగా కేరళ రాష్ట్రం ఎరుమేలిలో నిర్వహించిన ప్రత్యేక నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ అయ్యప్పస్వాముల వేషధారణలో, భక్తి భావం ఉట్టిపడేలా చేసిన నృత్యాలు అక్కడి వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మలిచాయి.
అయ్యప్ప స్వామి నామస్మరణల మధ్య నిర్వహించిన ఈ నృత్యాల్లో నాగిరెడ్డిపేటకు చెందిన పలువురు అయ్యప్పస్వాములు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా మాజీ జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ఈ నృత్యాల్లో పాల్గొని భక్తులతో కలిసి నర్తిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుమేలిలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే అయ్యప్పస్వాముల నృత్యాలు శబరిమల యాత్రలో ఒక విశేష ఘట్టంగా భావిస్తారు. నాగిరెడ్డిపేట అయ్యప్పస్వాములు చేసిన ఈ విన్యాసాలు అక్కడి భక్తులతో పాటు స్థానికుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాయి.
ఈ సందర్భంగా పాల్గొన్న అయ్యప్పస్వాములు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో యాత్ర సజావుగా సాగాలని ఆకాంక్షించారు.