భృణహత్యలకు చెక్ పెట్టాలంటూ… ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర
మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్ ప్రతినిధి నవంబర్ 18
ఆడశిశువు రక్షణ కోసం, దేశవ్యాప్తంగా భృణహత్యలను అరికట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యక్షంగా విజ్ఞప్తి చేయాలనే సంకల్పంతో ఇందూర్‌కు చెందిన శ్రీనివాస్ సైకిల్‌పై ఢిల్లీకి పయనమయ్యారు. భారతదేశ కుటుంబమే నా కుటుంబం… ఆడబిడ్డ భద్రత కోసం ఏదైనా చేయాలన్న తపనతో చలిని లెక్క చేయకుండా జర్నీ మొదలుపెట్టిన శ్రీనివాస్ సంకల్పం ప్రశంసనీయమని పలువురు అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్హెచ్‌ఆర్‌సీ (NHRC) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర, టీమ్ సభ్యులు ఆయనకు మద్దతు ప్రకటించారు. “సేవ్ గర్ల్ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి శ్రీనివాస్ చేస్తున్న అభ్యర్థన సముచితమైంది” అని వారు అభిప్రాయపడ్డారు. శ్రీనివాస్ యాత్ర సురక్షితంగా, విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నామని ధర్మేంద్ర తెలిపారు.