ఉమ్మడి నల్గొండ జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహిమూద్ ను శనివారం 10 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఈ ఘటన ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగింది. వక్ఫ్ బోర్డు కు సంబంధించిన సప్లమెంటరీ నివేదికను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు పంపేందుకు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం ఉంది.
బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ చర్యను చేపట్టారు. పట్టుబడిన అనంతరం, మహిమూద్ నివాసంలో సోదాలు నిర్వహించడానికి అధికారులు వెళ్లారు.
సోదాలు నల్గొండ కలెక్టరేట్ కార్యాలయానికి చెందిన వక్ఫ్ బోర్డు కార్యాలయంలో కొనసాగుతున్నాయి.












