17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరత్, పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, న్యాయవాదుల సమక్షంలో ఆయన విచారణకు హాజరయ్యారని తెలుస్తోంది.
ముందస్తు బెయిల్ ప్రయత్నాలు విఫలమవ్వడంతో, చట్టపరమైన రక్షణ అవకాశాలు తగ్గిపోవడంతో భగీరత్ స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసుపై పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా, భగీరత్ విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో న్యాయవాదుల సలహా మేరకు ఆయన లొంగిపోయినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ వ్యవహారంపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధికారులు కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.












