శవం శివంతో సమానం – మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ మానవతా సేవ
మనోరంజని ప్రతినిధి జమ్మలమడుగు (కడప జిల్లా), నవంబర్ 03:
స్థానిక దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన ఆరవేటి మద్దయ్య అనే వృద్ధుడు అనారోగ్యంతో మరణించగా, బంధువులు లేకపోవడంతో ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం తెలిసిన స్థానికులు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా, వారు వెంటనే స్పందించారు. ఫౌండేషన్ సభ్యులు సోమవారం సాయంత్రం హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మానవతా విలువలను కాపాడుతూ, మత భేదం లేకుండా సేవ చేయడం ఫౌండేషన్ లక్ష్యమని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్, వైస్ ప్రెసిడెంట్ మునీంద్రా, సభ్యులు సుబహాన్, సుమన్ బాబు, మైఖేల్ బాబు, ప్రసన్న కుమార్, అలాగే కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మా శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు 82972 53484, 91822 44150 నంబర్లను సంప్రదించవలసిందిగా ఫౌండేషన్ విజ్ఞప్తి చేసింది.