రిగ్గింగ్ చేసి గెలిచిన కాంగ్రెస్: మాగంటి సునీత

రిగ్గింగ్ చేసి గెలిచిన కాంగ్రెస్: మాగంటి సునీత

రిగ్గింగ్ చేసి గెలిచిన కాంగ్రెస్: మాగంటి సునీత

హైదరాబాద్, నవంబర్ 14: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజంతో ఉప ఎన్నిక జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది అని ఆమె అభివర్ణించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో మాగంటి సునీత తనదైన శైలిలో స్పందించారు. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆమె మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రిగ్గింగ్‌ చేసి గెలిచిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల సంఘం (ఈసీ) విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ది అసలు గెలుపే కాదని.. నైతికంగా తానే గెలిచానని ఈ సందర్భంగా మాగంటి సునీత స్పష్టం చేశారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్.. 24, 658 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈ ఉపఎన్నికలో బీజేపీ డిపాజిట్‌ గల్లంతయింది.

ఈ ఏడాది జూన్ 8వ తేదీన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నేత మాగంటి గోపినాథ్ తీవ్ర అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో నవంబర్ 11వ తేదీన ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం అంటే.. నవంబర్ 14వ తేదీన జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ ఘన విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలో సైతం కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని వెల్లడించిన విషయం విదితమే..

Join WhatsApp

Join Now

Leave a Comment