జూబ్లిహిల్స్ గెలుపుతో కాంగ్రెస్ నాయకుల సంబరాలు

జూబ్లిహిల్స్ గెలుపుతో కాంగ్రెస్ నాయకుల సంబరాలు

జూబ్లిహిల్స్ గెలుపుతో కాంగ్రెస్ నాయకుల సంబరాలు

సీఎం రేవంత్‌ చిత్రపటానికి పాలాభిషేకం

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్, నవంబర్ 14

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. విజయం సందర్భంగా గ్రామంలో బాణాసంచాలు పేల్చి, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్ షెఫిక్, మాజీ సర్పంచ్ చందు, మాజీ ఉప సర్పంచ్ పోశెట్టి, ఆత్మ డైరెక్టర్ రాజలింగు, సీనియర్ నాయకులు లస్మన్న, వంజరి కిషన్, ఆడేళ్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment