- గణనాథుడు 9 రోజుల ప్రత్యేక పూజలు అనంతరం నిమ్మజనం
- హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రణాళిక, సారథ్యం
- అధికారులు, విద్యావంతులు, ప్రముఖులకు అభినందనలు
- మీడియా, పత్రికలు, గణేష్ మండపం నిర్వాహకుల కృతజ్ఞతలు
హిందూ ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు తోట రాము
భైంసా : సెప్టెంబర్ 18
: భైంసా పట్టణంలో 9 రోజుల గణనాథ పూజలు అనంతరం నిమ్మజనం శాంతియుతంగా నిర్వహించారు. హిందూ ఉత్సవ సమితి, పోలీస్, రెవిన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యావంతులు మరియు ప్రముఖులు అందరికీ అభినందనలు
తెలియజేయడం జరిగింది. ఉత్సవాలను సాఫీగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ . హిందూ ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు తోట రాము కృతజ్ఞతలు
తెలిపారు
భైంసా పట్టణంలో 9 రోజుల పాటు నిర్వహించిన గణనాథ పూజలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా, గణేష్ నిమ్మజనం శాంతియుతంగా జరుగడాన్ని చూసిన హిందూ ఉత్సవ సమితి, పోలీస్, రెవిన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులకు అభినందనలు తెలియజేశారు. హిందూ సాంప్రదాయం ప్రకారం, 500 మంది విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల సమన్వయం, శాంతియుతంగా గణేష్ శోభాయాత్రను ముగించేందుకు సహకరించిన జిల్లా ఎస్పీ షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్, సిఐ రాజారెడ్డి, మరియు ఇతర అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొన్న మీడియా, పత్రిక విలేకరులు, గణేష్ మండపం నిర్వాహకులు, ప్రముఖులు మరియు విద్యావంతులందరికీ హిందూ ఉత్సవ సమితి తరపున అభినందనలు తెలియజేశారు.