- మహిళ కానిస్టేబుల్ శ్రావణి రోడ్డు ప్రమాదంలో మృతి
- జోగుళాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు సంతాపం
- బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ నుండి పూర్తి సహాయం
జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్ శ్రావణి, బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ తరుపున పూర్తి సహాయం అందించనున్నట్లు తెలిపారు.
జోగుళాంబ గద్వాల్ జిల్లా కేటీ దొడ్డి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్ శ్రావణి (డబ్యు పి సి -230) బుధవారం నాగార్జున సాగర్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమె రిసెప్షన్ విధుల్లో కృతజ్ఞతగా సేవలందిస్తూ పోలీసు శాఖలో తన పాత్రను నిబద్ధతతో నిర్వహించింది. ఆమె అకాల మరణం జిల్లా పోలీసు వ్యవస్థకు తీరనిదని ఎస్పీ టి. శ్రీనివాస రావు తెలిపారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పోలీసు శాఖ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.