ప్రొద్దుటూరు, జూలై 2
రైలు ప్రమాదంలో మృతిచెందిన గరికపాటి పృథ్విరాజ్ అనే వ్యక్తికి బంధువులు లేకపోవడంతో, ‘మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్’ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉన్న మృతదేహాన్ని స్వీకరించి, హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో రైలు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తికి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి ‘మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్’ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు.
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గరికపాటి పృథ్విరాజ్ అనే వ్యక్తి రైలు ప్రమాదంలో మృతిచెందగా, ఆయన మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది ‘మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్’ పట్టణ అధ్యక్షుడు సుబాహన్ను ఫోన్ ద్వారా సంప్రదించారు.
వెంటనే స్పందించిన ఫౌండేషన్ సభ్యులు గురువారం హిందూ శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు, పట్టణ అధ్యక్షుడు సుబాహన్, అహమ్మద్ హుస్సేన్, అశోక్ కుమార్, దస్తగిరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ, సమాజంలో ఎవరూ లేని వారికి కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్’ నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అలాగే, శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధుల సంక్షేమానికి సహాయం చేయాలనుకునే దాతలు 82972 53484, 91822 44150 నంబర్లను సంప్రదించాలని ఫౌండేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.










