మిర్యాలగూడలోని అశోక్ నగర్లో నివసిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ మారబోయిన మధుసూదన్ గుండెపోటుతో మరణించారు.
మధుసూదన్ గారు పత్రికా రంగంలో అనేక సంవత్సరాల పాటు సేవలందించారు. ఆయన మరణంతో పత్రికా రంగం ఒక ప్రతిభావంతుడిని కోల్పోయింది.
వారి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు నివాసానికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, బి ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ తదితరులు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా, వారు మధుసూదన్ గారి సేవలను కొనియాడారు మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు.












