డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాబాయి, ఆయన విద్యాభ్యాసానికి అండగా నిలిచి, కూలి పని చేసి సహాయం చేసిన మహనీయురాలని సామాజిక వేత్త, వైద్యులు జాడి రాజు అన్నారు. బుధవారం మిర్యాలగూడలో రమాబాయి 91వ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జాడి రాజు మాట్లాడుతూ, రమాబాయి అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకు సహాయం చేసిన గొప్ప త్యాగశీలి అని కొనియాడారు. ఆమె చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.
మహనీయురాలు రమాబాయి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాడి రాజు పిలుపునిచ్చారు. సమాజ పురోగతికి ఇలాంటి త్యాగాలను స్మరించుకోవడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వర్ధంతి కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్ళపల్లి రవి, సర్పంచ్ బెజ్జం సాయి, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ నాయక్, క్రాంతి నాయక్ బంటు వెంకటేశ్వర్లు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బొప్పని నగేష్, నరసయ్య, మర్రి జోజి కుమార్, చిలుకూరి అభినవ్, చింతల బాలు, సామ సైదులు, సామ కర్ణాకర్, నగేష్, కాకునూరి రవి, లక్క తదితరులు రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.








