హైదరాబాద్, 2026-08-09
ఆదివాసుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి పోడు భూములపై హక్కులు కల్పించాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ఆదివాసుల జీవన విధానాన్ని గౌరవిస్తూ వారి భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఆదివాసుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి పోడు భూములపై హక్కులు కల్పించాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ఆదివాసుల జీవన విధానాన్ని గౌరవిస్తూ వారి భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా
ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసులు తరతరాలుగా ప్రకృతి సంపదను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. తమ ప్రత్యేక సంస్కృతి, భాషలు, సంప్రదాయాలు, జీవన విధానాలను కాపాడుకుంటూ దేశ సాంస్కృతిక వైవిధ్యానికి గొప్పగా తోడ్పడుతున్నారని కొనియాడారు.
నిర్వాసితులవుతున్న ఆదివాసులు
దేశ జనాభాలో సుమారు 8.6 శాతం ఉన్న ఆదివాసులు ప్రకృతి, జీవ వైవిధ్య పరిరక్షణలో ముందుంటున్నారని పేర్కొన్నారు. అయితే అభివృద్ధి, మైనింగ్ ప్రాజెక్టుల కారణంగా అనేక ప్రాంతాల్లో ఆదివాసులు తమ నివాస ప్రాంతాలు, అడవుల నుంచి నిర్వాసితులవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సంస్కృతులు కనుమరుగయ్యే ప్రమాదం
ఆదివాసుల ప్రత్యేక భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. వారి విభిన్న సాంప్రదాయాలు, కళలు, మౌఖిక సాహిత్యం దేశ సంస్కృతికి మూలాధారాలుగా నిలిచాయని తెలిపారు.
ప్రభుత్వానికి సూచనలు
ప్రభుత్వం ఆదివాసుల అభివృద్ధికి పోడు భూముల హక్కులు కల్పించడంతో పాటు మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు అందించాలని కోరారు. గిరిజన హక్కులు, చట్టాలను కఠినంగా అమలు చేసి, ఆదివాసులకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
సమిష్టి కృషికి పిలుపు
ఆదివాసుల జీవన విధానాన్ని గౌరవిస్తూ.. వారి హక్కులను పరిరక్షించి.. భవిష్యత్తు తరాలకు సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితం అందించేందుకు ప్రభుత్వం, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని కృపాల్ సింగ్ సోడి పిలుపునిచ్చారు.











