Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని తాండ్ర.జి గ్రామంలో గత 7 సంవత్సరాలుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి, ఇటీవల బన్సపల్లికి బదిలీపై వెళ్లిన సౌందర్యకు ఘన సన్మానం జరిగింది. మంగళవారం తాండ్ర.జి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆమెకు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా గౌరవించారు.
నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని తాండ్ర.జి గ్రామంలో గత 7 సంవత్సరాలుగా పంచాయతీ కార్యదర్శిగా సేవలందించిన సౌందర్య, ఇటీవల దిలావర్పూర్ మండలం బన్సపల్లి గ్రామానికి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా మంగళవారం తాండ్ర.జి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆమెకు ఘన సన్మానం చేశారు. గత నెలలో బన్సపల్లికి బదిలీపై వెళ్లిన సౌందర్యకు, మంగళవారం తాండ్ర.జి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శాలువా కప్పి, పూలమాలలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రస్తుత తాండ్ర.జి గ్రామ పంచాయతీ కార్యదర్శి నీరటి రఘు చరణ్, సర్పంచ్ కొప్పుల వెన్నెల, ఉప సర్పంచ్ లక్ష్మి, వార్డ్ మెంబర్ జంగిల్ రవి, నాయకులు కొప్పుల నర్సయ్య, గంగన్న, గ్రామ కారోబర్ లస్మన్న, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మారెడ్డి, అంగన్వాడి సిబ్బంది గోదావరి, వనజ, సరిత, ఇందిరమ్మ, గ్రామ కమిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సారంగాపూర్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.












