పేద మహిళలకు ఉపాధి కల్పించే దిశగా బి. ఎన్ రావు పౌండేషన్ నూకపెల్లి గ్రామంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. పౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ బి. ఎన్ రావు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
బి. ఎన్ రావు పౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా, గ్రామంలోని నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి, వారిని ఆర్థికంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో బి. ఎన్ రావు మాట్లాడుతూ, ఈ శిక్షణ ద్వారా మహిళలు ఉపాధి పొందడమే కాకుండా, వారి వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక ఎదుగుదలకు ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు.
మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, సమాజంలో తమదైన ముద్ర వేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ శిక్షణ కేంద్రం వారి జీవితాల్లో మార్పు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి గ్రామస్థులు, స్థానిక ప్రతినిధులు హాజరై, శిక్షణా కేంద్రం ఏర్పాటును అభినందించారు. ఇది మహిళా సాధికారతకు ఒక ముఖ్యమైన అడుగు అని పలువురు అభిప్రాయపడ్డారు.











