ఇటీవల రాష్ట్ర స్థాయిలో అవార్డులు సాధించిన నిర్మల్ జిల్లా మహిళా సంఘాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో అధికారులను, సిబ్బందిని సన్మానించారు.
గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది చేసిన కృషిని కలెక్టర్ ప్రశంసించారు. మహిళా సంఘాల ప్రతిభకు ఈ అవార్డులు నిదర్శనమని, ఇది జిల్లాకు గర్వకారణమని ఆమె పేర్కొన్నారు.
భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పనిచేసి, జిల్లా అభివృద్ధికి మరింత దోహదపడాలని కలెక్టర్ సూచించారు. అవార్డుల సాధనకు కలెక్టర్ ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడిందని అధికారులు తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఇతర ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.











