నిజామాబాద్ నగరంలో సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ప్రముఖ ముస్లిం కమిటీ నాయకుడు ఆఫీస్ తాజమహుల్ సాహెబ్ అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
గత 55 ఏళ్లుగా సామాజిక సేవలో నిమగ్నమైన తాజమహుల్ సాహెబ్, ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలిచేవారు. ఆయన మరణం నగర ప్రజలకు తీరని లోటు అని పలువురు పేర్కొన్నారు.
ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ఇలాంటి ప్రముఖులు మరణించడం దురదృష్టకరమని, ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజమహుల్ సాహెబ్ మరణవార్తతో ఆయన మిత్రులు, అనుచరులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సంతాపం తెలిపారు.


