నిజామాబాద్, జూన్ 27
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అతలాంటిక్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం తాడెం గ్రామ మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి కుమార్తె, కుప్పన్పల్లి గ్రామానికి చెందిన సాయి రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు హాజరయ్యారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులోని అతలాంటిక్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం వివాహ రిసెప్షన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
తాడెం గ్రామ మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి కుమార్తె, కుప్పన్పల్లి గ్రామానికి చెందిన సాయి రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి నిజామాబాద్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జేయేసీ చైర్మన్ గోపాల్ శర్మ, న్యాయవాది పులి జైపాల్, పీఎంపీ డాక్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పులగం మోహన్, బి. శ్రీనివాస్ రావు, భాస్కర్ రెడ్డి, సురేందర్ రావు, రాజ్ గుప్తా, ఎల్లయ్య యాదవ్, మాజీ సర్పంచ్ దుపెల్లి సాయారెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












