ఇచ్చోడ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన నూతన ఇంటికి గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
స్థానిక సర్పంచ్ జలై జాకుతో కలిసి, లబ్ధిదారులైన శ్యామల – గంగయ్య దంపతుల ఆహ్వానం మేరకు ఆడే గజేందర్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రాముఖ్యతను వివరించారు.
పేద కుటుంబాల సొంత ఇంటి కలను నెరవేర్చడంలో ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని, ప్రతి కుటుంబం గౌరవంగా జీవించేందుకు సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం దీనిని అమలు చేస్తోందని ఆడే గజేందర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇచ్చోడ మండల అధ్యక్షుడు కళ్ళెం నారాయణ రెడ్డి, కుమారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మందుల రమేష్, కోకస్ మన్నూర్ సర్పంచ్ షామిమ్ యూసఫ్, మైనారిటీ సెల్ నియోజకవర్గ చైర్మన్ ముస్తఫా, ఎస్సీ సెల్ నియోజకవర్గ చైర్మన్ కొత్తూరి లక్ష్మణ్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరై నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.











