ఉట్నూర్ సివిల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ కపిల్ రాథోడ్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా నాయకుడు బాబా టైగర్ చవాన్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఇంద్రవెల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కపిల్ రాథోడ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బాబా టైగర్ చవాన్ మాట్లాడుతూ, డాక్టర్ కపిల్ రాథోడ్ వైద్య రంగంలో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఇలాంటి సేవలు భవిష్యత్తులో కూడా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆయన ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రవీణ్, మనోజ్, విజయ్, రాజు నాయక్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ రాథోడ్ వైద్య సేవలను ప్రశంసిస్తూ, ఆయన దీర్ఘాయుష్షును ఆకాంక్షించారు.










