వార్డు) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ (10వ వార్డు)లో కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన సామూహిక షెడ్‌ను బీజేఎల్పీ నాయకుడు, నిర్మల్ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. స్థానిక అవసరాల మేరకు ఈ షెడ్ నిర్మించామని, దీని ద్వారా ప్రజలు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు.
నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ (10వ వార్డు)లో కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన సామూహిక షెడ్‌ను బీజేఎల్పీ నాయకుడు, నిర్మల్ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ సామూహిక షెడ్‌ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
ఈ షెడ్ ద్వారా స్థానిక ప్రజలు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సౌకర్యం కల్పించబడిందన్నారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వినిషా లక్ష్మి, జుట్టు దినేష్, ఈర్రి మోహన్ రెడ్డి, ప్రజ్యోత్ రావు, కోరిపెల్లి శ్రవణ్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, అలివేలు మంగ, మౌనిక, ప్రజాప్రతినిధులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.











