బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 08
బోథ్ మండలంలోని ధన్నూర్ బి గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని సంఘం నాయకులు కోరారు.

ప్రభుత్వ సహాయం డిమాండ్
పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు ఆసాల సదాశివ్ మాట్లాడుతూ, చేనేత కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక సహాయ సహకారులతో పాటు పింఛన్ కూడా అందించాలని డిమాండ్ చేశారు. చేనేత వస్త్రాలకు ప్రభుత్వపరంగా ప్రచారం కల్పించాలని ఆయన కోరారు.
చేనేత వస్త్రాల వినియోగం
ప్రతి పద్మశాలి బిడ్డ చేనేత వస్త్రాలను ధరించాలని సదాశివ్ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు సంతోష్ నరసయ్య, నారాయణ ఎర్రన్న, గణేష్ రాజేశ్వర్, సాయికిరణ్, సురేష్ మరియు పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు.