ఏల్బీ నగర్ జోన్ లో హై సిటి ప్రతిపాదనలను పరిశీలించిన కమిషనర్ ఆమ్రపాలి

Alt Name: ఎల్బీ నగర్ జోన్ హై సిటి ప్రతిపాదనలు కమిషనర్ ఆమ్రపాలి పరిశీలన
  • కమిషనర్ ఆమ్రపాలి బుధవారం ప్రాజెక్ట్ సి.ఈ, ఎస్.ఈ, ఇంజనీర్లతో కలిసి పరిశీలన
  • అల్కాపురి, టి.కె.ఆర్ జంక్షన్ నుంచి మంద మల్లమ్మ జంక్షన్ వరకు ఫ్లైఓవర్ ప్రతిపాదనలు
  • ఫ్లైఓవర్ అలైన్మెంట్ కోసం హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులతో సమన్వయం
  • బైరామల్‌గూడ ఆర్ఎచ్ఎస్ లూప్ కు భూసేకరణ చర్యలు

 Alt Name: ఎల్బీ నగర్ జోన్ హై సిటి ప్రతిపాదనలు కమిషనర్ ఆమ్రపాలి పరిశీలన

 ఏల్బీ నగర్ జోన్ లో హై సిటి క్రింద చేపట్టనున్న పనుల ప్రతిపాదనలను జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి బుధవారం పరిశీలించారు. అల్కాపురి జంక్షన్, టి.కె.ఆర్ జంక్షన్ నుండి మంద మల్లమ్మ జంక్షన్ వరకు ఫ్లైఓవర్ ప్రతిపాదనలను సమీక్షించారు. ఫ్లైఓవర్ అలైన్మెంట్ కోసం మెట్రో రైల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

 ఏల్బీ నగర్ జోన్ లో హై సిటి క్రింద చేపట్టనున్న పనుల ప్రతిపాదనలను జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి బుధవారం ప్రాజెక్ట్ సి.ఈ, ఎస్.ఈ, ఇతర ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు. ఈ సమావేశంలో, కమిషనర్ అల్కాపురి జంక్షన్ మరియు టి.కె.ఆర్ జంక్షన్ నుండి గాయత్రి నగర్, మంద మల్లమ్మ జంక్షన్ వరకు చేపట్టాల్సిన ఫ్లైఓవర్ ప్రతిపాదనలను సమీక్షించారు.

ప్రతిపాదిత ప్రాజెక్టుల ఆవశ్యకతను ప్రాజెక్ట్ సి.ఈ దేవానంద్ కమిషనర్ కు వివరించారు. అలాగే, ఫ్లైఓవర్ అలైన్మెంట్ కు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ఎల్‌బి నగర్ జంక్షన్‌ను పరిశీలించి, ఫ్రీ లెఫ్ట్ కోసం అవసరమైన భూసేకరణ నిర్వహణకు టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్ అధికారులతో సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఇంజనీర్‌లను ఆదేశించారు. బైరామల్‌గూడ ఆర్ఎచ్ఎస్ లూప్‌ను పరిశీలించి, సెపరేట్ గ్రేడ్ రోడ్ వర్క్‌ నుండి బైరామల్ గూడ ఆర్ లూప్‌ పూర్తి చేయడానికి ఆస్తుల సేకరణ వేగవంతంగా పూర్తిచేయడానికి టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ప్రాజెక్ట్ సి.ఈ దేవానంద్, ఎస్.ఈ, ఈ ఈ రోహిణి, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment