స్వర్ణ ప్రాజెక్టు సందర్శనలో కలెక్టర్ అభిలాష అభినవ్

స్వర్ణ ప్రాజెక్టు సందర్శనలో కలెక్టర్ స్వర్ణ ప్రాజెక్టు సందర్శనలో కలెక్టర్
  • స్వర్ణ ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్
  • గేట్ల ద్వారా 12080 క్యూసెక్కుల నీరు విడుదల
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టును ఆదివారం కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. భారీ వర్షాల కారణంగా 8 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి రావడంతో, 12 వేల 80 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రావద్దని సూచించారు.

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టును ఆదివారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 8 వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 1183 అడుగులకు చేరడంతో, నీటి పారుదల శాఖ అధికారులు 12 వేల 80 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు.

స్వర్ణ ప్రాజెక్టు సందర్శనలో కలెక్టర్

కలెక్టర్ అభిలాష అభినవ్, ప్రాజెక్టు వస్తున్న వరద పరిస్థితులు, ఔట్ ఫ్లో, ప్రాజెక్టు నీటి నిల్వ తదితర అంశాలను అధికారులతో చర్చించారు. రాబోయే 24 గంటల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాగు పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని హితవు పలికారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్శనలో కలెక్టర్ వెంట ఎస్పీ జానకి షర్మిల, ఈఈ లక్ష్మీ, స్థానిక ఎమ్మార్వో శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంతారావు, ఆర్ ఐ వెంకట నర్సయ్య, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment