- సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు.
- గణేష్ మండపాలలో భక్తి, శ్రద్ధలతో పూజలు జరపాలని పిలుపు.
- ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
- మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ మండపాలలో భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ మరియు అన్ని జిల్లాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రత్యేక పర్వదినం సందర్భంగా, వాడ వాడలలో ఉన్న గణేష్ మండపాలలో భక్తి శ్రద్ధలతో పూజలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
వినాయక నవరాత్రులు సందర్భంగా భక్తులు భారీగా గణేష్ మండపాల వద్ద చేరుతారని, ముఖ్యంగా హైదరాబాద్ నగరం సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఇక భక్తులు అధిక సంఖ్యలో ఉండే మండపాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు, ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం దృష్టి సారించారు. ఈ ఏడాది వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.