🔹 రెండు రోజుల పాటు ఢిల్లీలోనే బస
🔹 సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పయనం
🔹 బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చ
🔹 అసెంబ్లీలో చేసిన తీర్మానాలపై కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశం
📍 ఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన వెంట మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటూ, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అధిష్టాన పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ఈ అంశాలపై తీసుకున్న తీర్మానాలపై పార్టీ నాయకత్వానికి వివరాలు అందజేసే అవకాశం ఉంది.