నేతాజీ పబ్లిక్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్, నవంబర్ 14
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సారంగాపూర్ మండలం కౌట్ల ‘బి’ గ్రామంలోని నేతాజీ పబ్లిక్ స్కూల్లో గురువారం పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ తరగతులకు హాజరైన ఇతర విద్యార్థులకు పాఠాలు బోధించారు. భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తి పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఉపాధ్యాయుల విలువలు, బాధ్యతలను ప్రతి విద్యార్థి అర్థం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాల ప్రిన్సిపాల్ రేగుంట గంగాధర్, ఉపాధ్యాయులు ప్రకాష్, కృపారాణి, మంగమ్మ, పూజా, వనిత, సుమలత, సుమప్రియ, సంద్య తదితరులు పాల్గొన్నారు.