రైతన్న కు బాసట గా నిలిచేందుకు కొనుగోలు కేంద్రాలు

రైతన్న కు బాసట గా నిలిచేందుకు కొనుగోలు కేంద్రాలు

రైతన్న కు బాసట గా నిలిచేందుకు కొనుగోలు కేంద్రాలు

ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

మనోరంజని ప్రతినిధి

బైంసా : జనవరి 25

రైతన్నకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శనివారం భైంసా లోని గాంధీ గంజ్ లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ముధోల్ నియోజకవర్గం లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందన్నారు.కందులు క్వింటాలకి 7550 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రైతన్న కు బాసట గా నిలిచేందుకు కొనుగోలు కేంద్రాలు

ఎకరానికి మూడున్నర క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, రైతుల కోరిక మేరకు ఆరు క్వింటాళ్లు కొనుగోలు చేయాలని సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో మాట్లాడడం జరిగిందని, ఈ విషయంలో ఆయన సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం సోయా,పత్తి పంటలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే పెద్దమత్తలో కొనుగోలు చేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వ వాటా తోనే ఈ కొనుగోలు అన్ని పూర్తి చేశామని, రైతుల పక్షాన నిలిచే ప్రభుత్వం తమదని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతాంగ సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తున్నారన్నారు

రైతన్న కు బాసట గా నిలిచేందుకు కొనుగోలు కేంద్రాలు

. రానున్న రోజుల్లో మొక్కజొన్న, శనగ పంటలన్నీ ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు పిఎసిఎస్ ఆధ్వర్యంలో చైర్మన్ దేవేందర్ రెడ్డి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అనంద్ రావు పటేల్, వైస్ చైర్మన్ ఫరుఖ్,మార్క్ ఫెడ్ డైరెక్టర్ గంగా చరణ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తోటరాము, పిఎసిఎస్ డైరెక్టర్ వడ్నపు శ్రీనివాస్, కౌన్సిలర్ లు గౌతమ్ పింగ్లే, రావుల పోశెట్టి,బిజెపి నియోజకవర్గ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, పట్టణ బిజెపి అధ్యక్షులు ఏనుపోతుల మల్లేష్, భైంసా మండల బిజెపి అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment