బిఆర్ఎస్ నాయకుడు మెతుకు ఆనంద్ హౌస్ అరెస్ట్

Alt Name: మెతుకు ఆనంద్ హౌస్ అరెస్ట్
  1. బిఆర్ఎస్ నాయకుడు మెతుకు ఆనంద్ హౌస్ అరెస్ట్.
  2. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల పరిశీలన కోసం ఏర్పాటైన కమిటీలో సభ్యుడు.
  3. గాంధీ ఆసుపత్రి పర్యటనకు సిద్ధమైన సమయంలో హౌస్ అరెస్ట్.

వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు మరియు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌ను సోమవారం నాడు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. త్రీ మెన్ కమిటీలో భాగంగా ప్రభుత్వ దవాఖానల పరిస్థితులు తెలుసుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే గాంధీ ఆసుపత్రి పర్యటనకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

వికారాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌ను సోమవారం నాడు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలలో వైద్య సేవలు ఎలాంటి స్థితిలో ఉన్నాయో తెలుసుకునేందుకు టిఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా నియమించిన త్రీ మెన్ కమిటీకి ఆనంద్ సభ్యుడిగా ఉన్నారు. ఈ కమిటీలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య, డాక్టర్ సంజయ్ కూడా సభ్యులుగా ఉన్నారు.
త్రీ మెన్ కమిటీలో భాగంగా గాంధీ ఆసుపత్రిని పరిశీలించేందుకు సిద్ధమైన డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ నుండి బయలుదేరే ప్రయత్నం చేస్తుండగా, పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్దనే నిలిపివేయబడగా, ఆసుపత్రి పర్యటనను నిలిపివేశారు. హౌస్ అరెస్ట్ నేపథ్యంలో, బిఆర్ఎస్ నాయకులు దీనిపై నిరసన వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version