గాలిపటాలు ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు బాలుడి మృతి

**గాలిపటాలు ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు బాలుడి మృతి

మృతదేహాన్ని ఇంటికి తేవద్దన్న ఇంటి యజమాని వైఖరిపై తీవ్ర ఆగ్రహం**

నిజామాబాద్, డిసెంబర్ 30 (మనోరంజని తెలుగు టైమ్స్):
గాలిపటాలు ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు బాలుడి మృతి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న హృదయవిదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది. గాజులపేట ప్రాంతంలో గాలిపటాలు ఎగురవేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు దాబాపై నుంచి పడి అక్షిత్ (మూడో తరగతి విద్యార్థి) మృతి చెందాడు. అక్షిత్, కిషన్–పల్లవి దంపతుల కుమారుడు.
ప్రమాదం అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించగా, అద్దె ఇంటి యజమాని “మృతదేహాన్ని ఇంటి వద్దకు తేవద్దు” అంటూ మొండివైఖరి అవలంబించడంతో విషాదంలో ఉన్న కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. చేసేదేమీ లేక, స్నేహితుల ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచి అంత్యక్రియల ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.
ఈ ఘటనపై ఎన్‌.హెచ్‌.ఆర్‌.సి నిజామాబాద్ జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర తీవ్రంగా ఖండించారు. అద్దెకు ఉన్న కుటుంబ సభ్యుల మృతదేహాన్ని ఇంటికి రానివ్వకపోవడం అమానవీయ చర్య అని, ఇలాంటి ప్రవర్తనను సమాజం ఖచ్చితంగా విడనాడాలని ఆయన పేర్కొన్నారు. ఇంటి యజమానులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. మొండి వైఖరిని కొనసాగిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతి పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment