దుదిగాము గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం
మనోరంజని తెలుగు టైమ్స్ – మెండోరా ప్రతినిధి
నవంబర్ 15
దుదిగాము గ్రామ పరిధిలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యమైందని మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. ఎస్సై వెల్లడించిన వివరాల ప్రకారం — మృతుడు సుమారు 50 సంవత్సరాల వయస్సు గల పురుషుడు. ఆయన బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్, బ్లాక్ బెల్ట్ ధరించి ఉన్నారు. మృతునికి తెల్లటి వెంట్రుకలు, గడ్డం ఉన్నాయి. ప్రస్తుతం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో భద్రపరిచినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే మెండోరా పోలీసులను సంప్రదించాలని కోరారు.సంప్రదించవలసిన చారవాణి నంబర్:
📞 87126 59864