నూతనకోర్టులు నిర్మాణానికి భూమి పూజ.
సారంగాపూర్ జనవరి 04 మనోరంజని తెలుగు టైమ్స్
నిర్మల్ జిల్లా,
సారంగాపూర్:
కోర్టుల ద్వారా తక్షణ న్యాయం అందించేందుకు నూతన న్యాయస్థానాల సముదాయం దోహదపడుతుందని హైకోర్టు న్యాయమూర్తులు కె.సుజన, లక్ష్మణ్ లు పేర్కొన్నారు. ఆదివారం మండలం లోని డ్యాంగాపూర్ వద్ద 12 రకాల న్యాయస్థానాల సముదాయానికి వారు శంకుస్థాపన చేశారు 81 కోట్ల నిధులతో 6.32 ఎకరాల విస్తీర్ణంలో ఈ న్యాయస్థాల సముదాయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ప్రజా న్యాయస్థానంతో పాటు సీనియర్ జూనియర్ సివిల్ సెషన్స్ కోర్టులు ఫ్యామిలీ ఎస్సీ ఎస్టీ న్యాయస్థాన వంటి 12 రకాల న్యాయస్థానాలు నిర్మల్ లో అందుబాటులోకి రానున్న ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్ ,జిల్లా న్యాయమూర్తి శ్రీ వాణి,సీనియర్ సివిల్ న్యామూర్తి రాధిక,ఎస్పీ జానకి షర్మిల,బార్ అసోసియేషన్ అద్యక్షులు మల్లారెడ్డి,న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.