సన్మానోత్సవం
మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా ప్రతినిధి
నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్ పహాడ్ గ్రామంలో ఘనంగా సన్మానోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మైస అరవింద్, ఏసియఫ్ అవార్డు గ్రహీత ఆమడే జనార్ధన్, డీఎస్పీగా ఎన్నికైన కర్రెం సంపత్ రెడ్డి, ఎంబీబీఎస్ సీటు సంపాదించిన చందనే స్నేహిత్ లను వానల్ పహాడ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఉద్యోగులు కడారి దశరథ్, ధర్మాజీ చందనే, గందం దిగంబర్ గణపతి, భోజరాం రమణ, గౌర శ్రీనివాస్, రాంకుమార్, ముత్యం రెడ్డితో పాటు గ్రామస్తులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.