మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీదర్ బాబుపై జరుగుతున్న రాజకీయ కుట్రలను ఖండించిన బాణావత్ గోవింద్ నాయక్
పుట్ట మధు రాజకీయ కుట్రలు ఆమోదయోగ్యం కావని వ్యాఖ్య
రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి శ్రీదర్ బాబు పై తప్పుడు ఆరోపణలు
ప్రజా నమ్మకాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నమని మండిపాటు
మంత్రి నిజాయితీ, ప్రజాసేవా తపనను ప్రశంసించిన బాణావత్ గోవింద్ నాయక్
మనోరంజని తెలుగు టైమ్స్ ఖానాపూర్ ప్రతినిధి నవంబర్ 01
మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీదర్ బాబుపై జరుగుతున్న రాజకీయ కుట్రలను ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి శ్రీదర్ బాబుపై పుట్ట మధు చేస్తున్న తప్పుడు ఆరోపణలు ప్రజాస్వామ్యానికి అవమానం అని ఆయన పేర్కొన్నారు. గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు విస్తరించిన సమయంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొనగా, ప్రజా ప్రభుత్వంలో మంత్రి శ్రీదర్ బాబు రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి వేల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించారని ఆయన గుర్తు చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుండే నాయకుడిగా, ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజాసేవలో తపిస్తున్న వ్యక్తి శ్రీదర్ బాబు అని అన్నారు. ఆయన నిజాయితీ, నిబద్ధత, అభివృద్ధి పట్ల చూపుతున్న తపన రాష్ట్రానికి గర్వకారణమని అభినందించారు.
పుట్ట మధు చేసిన ఆరోపణలు నిరాధారమని, వ్యక్తిగత దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బాణావత్ గోవింద్ నాయక్ తెలిపారు. “మీకు ధైర్యం ఉంటే ఆధారాలతో ముందుకు రండి లేదా ప్రజల ముందు క్షమాపణ చెప్పండి” అని ఆయన సవాలు చేశారు. ప్రపంచ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి నమూనాను ప్రదర్శించే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లిన నాయకుడు శ్రీదర్ బాబుని ప్రజలే తమ హృదయాల్లో నిలిపారని ఆయన అన్నారు.