గోపాలపేటలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా
మనోరంజని తెలుగు టైమ్స్ – కామారెడ్డి జిల్లా, గోపాలపేట
కామారెడ్డి జిల్లాలోని గోపాలపేటలో అయ్యప్ప స్వామి పడిపూజ భక్తి భావంతో కన్నులపండువగా జరిగింది. ఆలయ ప్రాంగణం అర్చనలు, భజనలు, భక్తిరసంతో మార్మోగింది. పెద్ద ఎత్తున భక్తులు వేడుకకు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ల ఫోరం మాజీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. అయ్యప్పస్వామి దీక్షధారులను స్వయంగా బిక్ష వడ్డించి ఆశీర్వాదం అందుకున్నారు.
ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ—
“అయ్యప్పస్వామి 41 రోజుల దీక్ష ఎంతో శ్రమతో కూడుకున్నది. నియమ నిష్టలు పాటిస్తూ స్వామివారి పాదసేవలో నడిచే భక్తులు ఆధ్యాత్మికంగా మరింత బలపడతారు. ప్రతి ఒక్కరూ ఈ మార్గం లో నడిచి, మనసు ప్రశాంతం చేసుకోవాలి” అని సూచించారు.
గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో గోపాలపేట మొత్తం భక్తిరసంలో తేలిపోయింది.