అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

మనోరంజని తెలుగు టైమ్స్ – మెండోరా ప్రతినిధి, ఆగస్టు 10

మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయం గురించి మెండోరా ఎస్‌ఐ జాదవ్ సువాసిని తెలిపారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సుమారు 46 క్వింటాల్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో బాల్కొండ గ్రామానికి చెందిన వినేష్ మరియు నిర్మల్‌కు చెందిన సోఫియానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఇలాంటి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment