అక్రమ మద్యం పట్టివేత – కేసు నమోదు

అక్రమ మద్యం పట్టివేత – కేసు నమోదు

మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్, డిసెంబర్ 03

స్థానిక సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తుండడంతో అక్రమ మద్యం రవాణా, విక్రయాలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో బుధవారం సారంగాపూర్ మండలం కుప్టి తండాలో పోలీసులు బెల్ట్‌షాప్‌పై దాడి నిర్వహించారు. తనిఖీలలో 41.79 లీటర్ల అక్రమ మద్యం సుమారు అంచనా ₹17,791 విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్‌షాప్ నిర్వహకుడు పోతింట్ల రాములుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment