అయ్యప్ప ఆరట్టు నగర సంకీర్తనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి
మనోరంజని తెలుగు టైమ్స్ – డిసెంబర్ 05
అయ్యప్ప స్వామి ఆరట్టు సందర్భంగా నగర సంకీర్తన నిర్వహించనున్నట్లు అయ్యప్ప భక్త సమూహం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి కావాల్సిన అనుమతుల కోసం హరి హర క్షేత్రం ఆలయ గురుస్వాములు మూర్తి గురుస్వామి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, గురుస్వాములు గండ్రత్ రమేష్, కోట గంగాధర్ లు ఏసీపీ ఉపేందర్ రెడ్డిను కలిసి వినతిపత్రం అందజేశారు. అయ్యప్ప మాలధారులు, భక్తుల సమక్షంలో జరగబోయే ఈ సంకీర్తనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.