- ఆంధ్రప్రదేశ్ టెట్ హాల్ టికెట్స్ విడుదల
- అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు
- కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, రోజుకు రెండు సెషన్లు
: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) హాల్ టికెట్స్ శనివారం విడుదలయ్యాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా జరుగుతాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) కోసం హాల్ టికెట్స్ శనివారం విడుదలయ్యాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహిస్తారు. 18 రోజులు పాటు జరిగే ఈ పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో నిర్వహించబడతాయి – ఉదయం 9:30 నుంచి 12:00 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు రెండో సెషన్.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://aptet.apcfss.in/# నుండి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ Candidate ID, పుట్టిన తేదీ మరియు వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేసి హాల్ టికెట్ పొందవచ్చు. పరీక్షకు హాజరు కావడానికి హాల్ టికెట్ తప్పనిసరి.