ఈ నెల 16న గుజరాత్‌ లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు గుజరాత్ పర్యటన
  • ఏపీ సీఎం చంద్రబాబు గుజరాత్ పర్యటన ఖరారు
  • గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌లో పాల్గొననున్న చంద్రబాబు
  • ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ ముఖ్య అతిథులు

ఏపీ సీఎం చంద్రబాబు గుజరాత్ పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 16న గుజరాత్ పర్యటనకు వెళ్తున్నారు. గాంధీనగర్‌లో మూడు రోజుల పాటు జరగనున్న గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌లో ఆయన పాల్గొననున్నారు. ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనుండగా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దిశానిర్దేశం చేయనున్నారు.

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుజరాత్ పర్యటన ఈ నెల 16న ఖరారైంది. గాంధీనగర్‌లో కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ ఆధ్వర్యంలో జరగనున్న గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌కు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కూడా పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ సమావేశంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల భాగస్వామ్యంతో ఇన్వెస్టర్లకు ఒక వేదికగా నిలుస్తుంది. పునరుత్పాదక ఇంధనానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని, ఈ సదస్సు కీలకంగా మారనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment