అందె శ్రీ మృతి సాహితీ
సాంస్కృతిక ప్రపంచంలో
పూడ్చలేని లోటు
(ప్రజాకవి డాక్టర్ అందేశ్రీకి అశ్రునివాలి
పాటనైబ్రతికే ఉంటా
పాటల పూతోటనై ప్రతి
ఇంట వెలుస్తా…..)
పల్లెలో పుట్టి సహజ సిద్ధ
ప్రతిభతో అగ్రశ్రేణి కవిగా
సాహితీ లోకంలో
ధ్రువతారగా వెలిగి
ప్రభంజనమై నిలిచిన అందెశ్రీ
అనాధ అక్షర జ్ఞానం లేని
తాపీమేస్త్రి పశువుల కాపరి
ప్రకృతి ప్రేమికుడు సహజ కవి
ప్రజా కవి జానపద సాహితీ
పితామహుడు ఆచార్య
బిరుదు రామరాజు
మార్గదర్శకత్వంలో సాహిత్య
యజ్ఞాన్ని ఆరంభించిన
అందె శ్రీ జానపద సాహితీ
జగత్తులో వెలిగిన ధృవతార
తెలంగాణ ఉద్యమానికి ఉత్తేజం
ప్రజల పోరాటాలను ఆకాంక్షలను
ఏకంచేసి ప్రజాగొంతుకై నిలిచిన
అందె శ్రీ మృతి సాహితీ
సాంస్కృతిక మేథో
ప్రపంచానికి తీరని లోటు
అందె శ్రీ తన పాటలతో ప్రజల
ఆకాంక్షలను ఏకం చేసినగొప్ప
జానపద సాహితీ వేత్త
ప్రజల సామాజిక హృదయాల
స్పందనకు రూపమిచ్చిన
కవితా రూపశిల్పి
ఆయన పాట ఉద్యమానికి
ఉత్తేజం మాట పోరాటానికి
ఉత్ప్రేరకం మాట ధిక్కార స్వరం
అతని పాట చైతన్యం
కవిత్వం గాయపడిన
హృదయాలకు ఓదార్పు
తన పాటలతో ప్రజలను
ఉద్యమింపంప చేసిన
ఉద్యమశీలి
ఉద్యమానికి పాటగా తోడై
నిలిచిన పాటల వారిది
తన పాటతో ప్రజలను
ఉద్యమ శక్తిగాతీర్చి దిద్దిన
సిద్ధాంత వేత్త
మాయమైపోతున్న మనిషి అన్న
పాట మనిషితనాన్ని తట్టి లేపిన
మానవతా మూర్తి
మానవ జీవితతత్వాన్ని
ఔపాసన పట్టిన సాహితీ దిగ్గజం
మనిషి నైజాన్ని పసి కట్టిన
మానవతావాది
మనిషి సృష్టించిన రూపాయి
మనిషిని నడిపిస్తుందంటూ
మనిషి ధనానికి బానిసైనాడని
బంధాలు అనుబంధాలు కరువై
ఆధిపత్యం అవినీతి స్వార్థం
నిరంకుశత్వం సామాజిక
రుగ్మతలకు మూలమని
తన రచనల ద్వారా
నిరసించాడు
కుల మతాలు వద్దని
మమతా సమతా కేతనం
ఎగిరేసిన లోక కవి
మట్టిలో పుట్టిన మాణిక్యం
జయ జయహే తెలంగాణ
రాష్ట్ర గీతం అందేశ్రీని సాహితీ
చరిత్రలో చిరస్మరణీయ
స్పూర్తిగా నిలుపుతుంది
నిప్పుల వాగు సంకలనం
సాహిత్య చరిత్రలో అద్భుతం
తెలంగాణ ఆకాంక్షను
ఏకస్వరంగా వినిపించి
తెలంగాణ జెండాను
రెవరపలాడించిన ప్రజాకవి
జయ జయ హే తెలంగాణ
గీతాన్ని రచించి ముక్కోటి
తెలంగాణ ప్రజలను
చైతన్యపరిచి తెలంగాణ
అస్తిత్వం కోసం పోరాడిన
సాహితీ దిగ్గజం
అక్షర జ్ఞానం లేకపోయినా
అనంతలోకజ్ఞానంతో
సమాజంలో కుళ్ళు
కుతంత్రాను ఎదిరించిన
థీశాలి గాయాలను
గేయాలుగా మార్చిన
వాగ్గేయకారుడిగా
తెలుగు సాహిత్యంలో
నిలిచిపోతాడు
సిద్ధప్ప వరకవి నిరంతర
అచల చైతన్యతత్వం
వరకవి జ్ఞాన బోధిని
తత్వాలచే ప్రభావితమైనట్లు
అందె శ్రీ వెల్లడించారు
ఆశువుగా కవిత్వం చెప్పిన
అందె ఎల్లయ్య ప్రతిభను
గుర్తించిన శంకర్ మహరాజ్.
చేతఅందెశ్రీగానామకరణం
పొందిన అందె శ్రీని
అలంకరించిన అవార్డులు
కాకతీయ యూనివర్సిటీ
నుండి గౌరవడాక్టరేట్
దాశరధి పురస్కారం
రావూరి భరద్వాజ పురస్కారం
జానకమ్మ సాహితీ పురస్కారం
దాశరధి కృష్ణమాచార్య
పురస్కారం లోకనాయక్
పురస్కారం అందుకున్నారు
జానపద గీతాలు విప్లవ
గీతాలు కొమ్మ చెక్కుతే
బొమ్మర కొలిచి మొక్కుతే
అమ్మర కాలం కరవాలం
వెళ్ళిపోతున్నావా జన
జాతరలో మన గీతం విశేష
జనాదరణ పొందాయి
ప్రపంచంలోనే ముఖ్యమైన
నదులను సందర్శించడం
అందెశ్రీ ప్రకృతి పట్ల శ్రద్ధ కు
నిదర్శనం ప్రకృతి ద్వారా
పాఠాలు నేర్చుకున్న సహజ
కవిగా గుర్తింపు పొందాడు
అందె శ్రీ రచించిన
జయ జయహే తెలంగాణ
గీతం రాష్ట్ర గీతంగా
గుర్తింపు పొందడం
అభినందనీయం
అందె శ్రీ సాంస్కృతిక సారధి
తెలంగాణ దూం ధాం కార్యక్రమ
రూపశిల్పి ఉద్యమ స్ఫూర్తి ప్రదాత
నీ పాటలు నీ కవితలు
ఏకాలానికైనా ప్రజా ఉద్యమాలకు
ఖరదీపికలుగా నిలుస్తాయి
అందెశ్రీ సాధించే పట్టుదలకు
ఎదిరించే ధీరత్వానికి
మాట మీద నిలబడే
తత్వానికి ప్రతీక
విమర్శకుల హృదయాలను
గెలుచుకున్న మహా మనిషి
జన జాతరలో నీ గీతం
జయకేతనమైనిలుస్తుంది
సమాజంలో అంతరిస్తున్న
మానవీయవిలువలు ఆత్మీయత
అనుబంధాలు ఆప్యాయత
అనురాగాలు మమత సమత
విలువల పరిరక్షణకై ప్రభుత్వం
పౌరసమాజంఉద్యమించడమే
అందె శ్రీకిచెల్లించే నిజమైన నివాళి
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక ఫోరం
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
అద్యక్షులు
తెలంగాణ కుమ్మర సంఘం 880/2014
కరీంనగర్9440245771