పార్టీ మారని నాయకునికి దక్కిన గౌరవం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆనంద్ రావ్ పటేల్ దే పై చేయి బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆనందరావు పటేల్

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
భైంసా : అక్టోబర్ 23
 
ఆయన కరుడుగట్టిన కాంగ్రెస్ వాది, ముధోల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ అంటేనే ఆనందరావు పటేల్, ఆనందరావు పటేల్ అంటేనే కాంగ్రెస్ ఇది ముధోల్ ప్రజల మాట. పలుమార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఆశించినప్పటికీ దక్కకపోయినా, ఆయన పార్టీ నాయకత్వాన్ని సమర్థించారు. పార్టీ ఆదేశాలనే శిరోధార్యంగా భావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆనంద్ రావు పటేల్ కు దక్కుతుందనుకుంటే, నిన్న మొన్న కాంగ్రెస్ లో చేరిన నాయకులు ఆయనకు ఎన్నో అవరోధాలు అడ్డంకులు సృష్టించారు. ఆనంద్ రావు పటేల్ కు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కితే ఇక మా ఆటలు సాగమని భావించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన ఆది నాయకత్వం ఆనంద్ రావు పటేల్ కే పగ్గాలు ఇచ్చి, మార్కెట్ కమిటీ చైర్మన్ కూర్చిపై కూర్చోబెట్టింది. బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆనందరావు పటేల్ ను నియమిస్తున్నట్లు తెలియడంతో కాంగ్రెస్ పార్టీలో వర్గం ఓ అసంతృప్తిగా ఉన్నప్పటికీ, నియోజకవర్గంలో మాత్రం ఆయనకు సరైన గౌరవం దక్కిందన్న చర్చ అగుపడుతుంది. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో పలు మార్లు అన్ని తానై వ్యవహరించారు ఆనందరావు పటేల్.. ఇప్పటికే రెండు వర్గాల తో, ముగ్గురు మాజీ ఎమ్మెల్యే లతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి, ఆనందరావు పటేల్ కు పదవి రావడంతో ఇక కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారన్న ఆశ క్యాడర్లో నెలకొంది. రైతు బిడ్డకు మార్కెట్ పదవి దక్కడం పట్ల రైతుల్లో, అన్ని పార్టీల్లో సైతం హర్షం వ్యక్తం అవుతుంది
 

Leave a Comment