: ప్రజల రక్షణతో పాటు శాంతి భద్రతల రక్షణలో ముందుండాలి

  • ట్రైనీ ఎస్ఐలకు సూచనలిచ్చిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల
  • క్రమశిక్షణతో అంకిత భావం కలిగి పని చేయాలని సూచన
  • జిల్లా ఎస్పీ ట్రైనీ ఎస్ఐలను మర్యాదపూర్వకంగా కలిశారు

నిర్మల్ జిల్లాకు కేటాయించబడిన 7 మంది ట్రైనీ ఎస్ఐలు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ ట్రైనీ ఎస్ఐలకు క్రమశిక్షణతో, అంకిత భావంతో విధులు నిర్వహించాలని సూచించారు. శిక్షణలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తూ ప్రజల రక్షణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో ముందుండాలని కోరారు.

నిర్మల్: సెప్టెంబర్ 25

నిర్మల్ జిల్లాకు కేటాయించబడిన 7 మంది ట్రైనీ ఎస్ఐలు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ట్రైనీ ఎస్ఐలకు శుభాకాంక్షలు తెలియజేసి, క్రమశిక్షణకు మారుపేరు అయిన పోలీసు డిపార్ట్మెంట్‌లో వారు నియమితులైనందుకు గర్వపడాలని సూచించారు. ఆమె ట్రైనీ ఎస్ఐలను, విధి నిర్వహణలో అంకిత భావం ఉండి, జిల్లాకే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

జిల్లాలో విధులు నిర్వహిస్తూ ప్రజల రక్షణ, శాంతి భద్రతలను కాపాడడం పట్ల శ్రద్ధ చూపాలని, అన్ని శాఖల అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. క్రమశిక్షణతో అన్ని విధులను నిబద్ధతగా నేర్చుకోవాలని, శిక్షణలో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించడం ద్వారా అనుభవం పొందాలని అన్నారు.

Leave a Comment