జిల్లా కోర్టు సముదాయ భవనాలను ప్రజలకు అందుబాటులో ఉండే చోట నిర్మించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన అల్లూరి మల్లా రెడ్డి గారు.
నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మల్ పట్టణమునకు దూరంగా నిర్మించడం వలన ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. కనుక నిర్మల్ జిల్లా కేంద్రములో నూతనంగా నిర్మించ తలపెట్టిన జిల్లా కోర్టు సముదాయ భవనాలను పాత MRO ఆఫీస్ స్థలం నిర్మల్ కోర్టు సముదాయ భవనాలను నిర్మించదానికి కేటాయించి నిర్మించి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధముగా చూడాలని నిర్మల్ జిల్లా బార్ అసోసియేషన్ తరపున మరియు నిర్మల్ సిటిజన్ ఫోరం నాయకులు,నిర్మల్ న్యాయవాదులు ,నాయకులు మరియు నిర్మల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ అల్లూరి మల్లా రెడ్డి గారు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నిర్మల్ పెన్సనర్ అధ్యక్షులు MC లింగన్న గారు, న్యాయవాదులు శంతన్ రెడ్డి గారు,రమేష్,రత్నం,నరేందర్, మధుకర్ మరియు ఇతర న్యాయవాదులు, నాయకులు పాల్గొన్నారు.