నిర్మల్, 21 July
నిర్మల్ జిల్లాలో బోడ కాకర కాయకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. భైంసా సోమవారం మార్కెట్లో కిలో రూ.400 ధర పలికింది. ఆరోగ్య ప్రయోజనాలు, షుగర్ నియంత్రణ గుణాల వల్ల దీనికి డిమాండ్ పెరిగింది.
నిర్మల్ జిల్లాలో బోడ కాకర కాయకు భారీ గిరాకీ నెలకొంది. భైంసా సోమవారం మార్కెట్‌కు వచ్చిన బోడ కాకర కిలో రూ.400 పలికింది. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ వినియోగదారులు ఆసక్తిగా కొనుగోలు చేశారు.
ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు, షుగర్‌ను అదుపులో ఉంచే గుణాలు ఉండటంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. చికెన్ ధర కంటే రెట్టింపు ఉన్నా, ఏడాదికి రెండు నెలలు మాత్రమే దొరుకుతుందని వ్యాపారులు తెలిపారు.












