అశ్వాపురం, 2024-06-05
పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అర్ధరాత్రి ఆకస్మికంగా మారెళ్ళపాడు ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. రైతులకు నీరందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

పనుల వేగవంతంపై ఆదేశాలు
వీలైనంత త్వరగా తుమ్మల చెరువుకు గోదావరి నీళ్లు తరలించేందుకు పనులు వేగవంతం చేయాలని ఆయన సూచించారు. రాత్రిపగలు (24/7) రెండు షిఫ్టుల్లో పనులు నిర్విరామంగా నిర్వహించాలని, నాలుగైదు రోజుల్లో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలస్యాన్ని, అలసత్వాన్ని ఏ పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
పనులు పూర్తయ్యేవరకు అక్కడే ఉంటా
అవసరమైతే పనులు పూర్తయ్యేవరకు పగలూ రాత్రి తేడా లేకుండా ఇక్కడే మకాం వేసుకొని ఉంటానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికారులకు తెలిపారు. నెలాఖరులోగా ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసి, రైతులకు నీరందించాలని ఆయన స్పష్టం చేశారు.