.*రైతుల ధాన్యం నిల్వ కోసం పటిష్ట చర్యలు*
*మహాగాం లో పది ఎకరాల్లో గిడ్డంగుల నిర్మాణనికి సన్నాహాలు* *గిడ్డంగుల సంస్థ అధికారులు, రెవిన్యూ అధికారుల భూ పరిశీలన* *ఎమ్మెల్యే సూచనల మేరకు భూసర్వే* రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తే నిల్వ కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ముధోల్ నియోజకవర్గం లోనే పెద్ద మొత్తంలో గిడ్డంగుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టునుంది. *ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్* పలుమార్లు ప్రభుత్వానికి సమస్యను విన్నవించడం తో గిడ్డంగుల నిర్మాణం కోసం ప్రభుత్వం భూ సర్వేను చేపట్టింది. మహాగాం గ్రామంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో గిడ్డంగుల సంస్థ అధికారులతో పాటు, భైంసా తహసీల్దార్ భూమిని పరిశీలించారు. పది ఎకరాల విస్తీర్ణంలో గిడ్డంగుల నిర్మాణం చేపడితే ఈ ప్రాంత ప్రజలకు పంట నిల్వ ఉంచుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. ఆదిశగా గిడ్డంగుల సంస్థ తన ప్రక్రియను ప్రారంభించింది. ఈ సందర్భంగా మహగాం సర్పంచ్ అప్పల రాజ్యలక్ష్మి రాకేష్ మాట్లాడుతూ గిడ్డంగుల నిర్మాణానికి తమ దగ్గర ప్రభుత్వ భూమి ఉందని, ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తమ గ్రామంలో గిడ్డంగులు నిర్మించాలని ప్రతిపాదనలు పంపడం సంతోషంగా ఉందన్నారు. గిడ్డంగుల నిర్మాణం జరిగితే రైతులకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు, గిడ్డంగుల సంస్థకు, అధికారులకు, సర్పంచ్ కృతజ్ఞతలు చెప్పారు.












