జిల్లాలో జొన్నల కొనుగోలు ప్రక్రియపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి గింజను కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జొన్నల కొనుగోలు నిరంతరాయంగా కొనసాగుతుందని, గతంలో జరిగిన అపోహలకు తావులేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
వ్యవసాయ శాఖ రూపొందించిన గ్రామవారీ షెడ్యూల్ ప్రకారమే రైతులు తమ పంటను మార్కెట్కు తీసుకురావాలని, తద్వారా రద్దీని తగ్గించి ఇబ్బందులు నివారించవచ్చని ఆయన సూచించారు.
జిల్లాలో ఇప్పటికే 13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.












