రైతులు తమ పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి (ఇందిర క్రాంతి పథం) కొనుగోలు కేంద్రాలలో విక్రయించి, మద్దతు ధరను పొందాలని మిర్యాలగూడ మండల తహసిల్దార్ శ్రీనివాస్ సూచించారు. ఇది రైతులకు ఆర్థికంగా మేలు చేస్తుందని ఆయన తెలిపారు.
మంగళవారం మిర్యాలగూడ మండలం అవంతిపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సన్న రకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి, అవంతిపురం మరియు ఆళ్లగడప సర్పంచులు వల్లపు దాసు సుజాత సురేష్, ఇంద్రపల్లి కుమారి దేవదాస్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా, నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మాలని సూచించారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, రైతులకు సరైన ధర లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకునూరు బసవయ్య గౌడ్, పిఐసి కృష్ణ, మార్కెట్ కార్యదర్శి వెంకన్న, సహాయ కార్యదర్శి బాల్ శెట్టి, మధు బాబు గౌడ్, మండల వ్యవసాయ అధికారి సైదానాయక్, రాయిని పాలెం ములకల కాలువ సర్పంచులు చిలకల మురళి యాదవ్, కొండ శ్వేతజోష్ గౌడ్, ఏఈఓలు షఫీ, గోపి, పంచాయతీ కార్యదర్శి శైలజ, ఆలగడప, మిర్యాలగూడ పీఏసీఎస్ ఇన్చార్జీలు పి. నాగయ్య, సతీష్ తోపాటు శ్రీనివాస చారి, కే. సైదులు, ప్రవీణ్వి, విజయ్, వెంకట్రాములు, సుధాకర్, సురేందర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు హాజరయ్యారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. రైతులు తమ ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు కేంద్రాలకు తరలించాలని అధికారులు కోరారు.











