రాష్ట్రంలో నెలకొన్న డీజిల్, పెట్రోల్ కొరతకు కేంద్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ ఆరోపించారు. ముందుచూపు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు.
పంటలు కోత దశలో ఉన్న సమయంలో యంత్రాలకు డీజిల్ అత్యవసరమని, ప్రస్తుతం ఆయిల్ కొరత కారణంగా కోత మిషన్లు నిలిచిపోయాయని తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మొక్కజొన్న పంటలు ఉన్నప్పటికీ, డీజిల్ కొరత వల్ల లారీలు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గోవింద్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో అనేక పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయని, ఇది రైతులకు మరింత కష్టాలు కలిగిస్తోందని ఆయన అన్నారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి, డీజిల్ కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని గోవింద్ నాయక్ డిమాండ్ చేశారు.












